సిద్దేశ్వరం జల జాగరణ దీక్ష
తీసుకపోడాన్ని ప్రశ్నిస్తూ డా. యం.వి రమణారెడ్డి రాయలసీమ విమోచన సమితి అధ్వర్యంలో 1984 లో పోరాటం మొదలుపెట్టారు. ఆ తర్వాత వై.యస్ రాజశేఖరరెడ్డి, మైసూరారెడ్డి తదితరులందరూ ఈ పోరాటంలో భాగస్వామ్యం అయ్యారు. ఈ పోరాటాల ఫలితంగా అప్పటి ముఖ్యమంత్రి నందమూరి రామారావు తెలుగు గంగ, యస్.ఆర్.బి.సి గాలేరునగరి, హంద్రీనీవా ప్రాజక్టులకు బీజం వేశారు.
ఈ నాలుగు రాయలసీమ ప్రాజక్టులకు నీరందాలంటే శ్రీశైలం బ్యాక్ వాటరే కీలకం. శ్రీ శైలం పొంగి పొర్లితే కానీ నీళ్ళు అందవు. జూలై నుండి సెప్టెంబరు వరకు వచ్చే నీటితో శ్రీశైలం నిండితే గేట్లు ఎత్తి దిగువకు వదిలేస్తారు. నవంబర్ లో వరదలొస్తేనే పోతిరెడ్డిపాడు వద్ద నీళ్ళు అందుకొనే వీలుంటుంది.
ఈ కారణంగానే సిద్దేశ్వరం వద్ద శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో దాదాపు 80 టి.యం.సీలు నిలబడేలా అలుగు నిర్మించాలని సీమ వాసులు ఉద్యమిస్తూవచ్చారు.
ఈ అలుగు వలన సీమ ప్రాజక్టులతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాజక్టులకు అవసరమైన నీరు అందుబాటులో ఉంటుంది. శ్రీశైలం గేట్లతో పనిలేకుండా ఈ అలుగు ఇక్కడి అవసరాలు తీరుస్తుంది.
పార్లమెంటులో ఆమోదించిన విభజన చట్టం ప్రకారం పై సీమ ప్రాజక్టులను నిర్మించి , నీళ్ళు ఇస్తామని స్పష్టంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజక్టులకు నీరివ్వాలనే తపనతో సిద్దేశ్వరం వద్ద రాయలసీమ లిప్ట్ స్కీమ్ ను ప్రకటించారు. ఆ లిప్ట్ కు అవసరమైన నీరు అలుగు నిర్మిస్తేనే సాకరమవుతుంది. తెలంగాణకు కూడా ఈ అలుగు కీలకం.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం సిద్దేశ్వరం వారధితో పాటు ఆ వారధికి అడుగు భాగంలో అలుగు కూడా నిర్మిస్తే అది బహుళార్థకంగా ఉపయోగపడుతుంది.
కరువు పీడితప్రాంతాలకు నీరివ్వడంతో పాటు, పర్యాటకంగా, మత్స్య సంపదకూ ఉపయోగపడుతుంది.
వరదల నియంత్రణకు, శ్రీ శైలం ప్రాజెక్టులో పూడిక నివారణకు, మరమ్మత్తులకు, భద్రతా దృష్ట్యా సిద్దేశ్వరం అలుగు అత్యవసరం.
తక్షణం ఉభయ తెలుగు రాష్ట్రాలు సిద్దేశ్వరం వారధితో పాటు, అతి తక్కువ ఖర్చుతో వారధిలో భాగంగానే సిద్దేశ్వరం అలుగు అలుగు నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ, జలవనరుల శాఖలతో కార్యచరణకు సిద్దం కావాలి. కరువుపీడిత ప్రాంతాలకు అండగా నిలవాలి.
—————————-
డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి,
కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత,
వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం,
అనంతపురము.
99639 17187